వేధింపుల పై ‘సింగర్‌ మధు ప్రియ’ ఫిర్యాదు !

Published on May 22, 2021 10:01 pm IST

తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘సింగర్‌ మధు ప్రియ’కి గత కొంత కాలంగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బ్లాంక్‌ కాల్స్‌ వస్తున్నాయిని, అసభ్యకరమైన మెసేజ్ లు వస్తున్నాయని మధు ప్రియ ఈ-మెయిల్‌ ద్వారా షీ టీమ్‌ కు ఈ రోజు ఫిర్యాదు చేసింది. అలాగే తనను సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా కూడా వేధిస్తున్నారని, తనకు వచ్చిన ఆ అసభ్యకరమైన మెయిల్స్ ను కూడా మధుప్రియ షీ-టీమ్‌, సైబర్‌ క్రైం పోలీసులకు అందించింది.

ఇక తనకు వచ్చిన బ్లాంక్‌ కాల్స్‌ కి సంబదించిన డిటైల్స్ ను కూడా సైబర్‌ క్రైం పోలీసులకు ఇచ్చింది. మధుప్రియ ఫిర్యాదు మేరకు ఐపీసీ 509, 354(బి) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. మధుప్రియ సినిమా సాంగ్స్ తో పాటు పలు షోలలో కూడా సందడి చేస్తోంది. మధు ప్రియ సింగింగ్‌ స్టైల్‌ కొత్తగా ఉంటుంది.

సంబంధిత సమాచారం :