డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చీట్ !

Published on May 14, 2019 1:03 pm IST

రెండు సంవత్సరాల క్రితం తెలుగు పరిశ్రమలోని పలువురు నటీ నటులు, దర్శకులు డార్గ్స్ వాడుతున్నారని, వారికి డ్రగ్స్ సప్లై చేసేవారికి సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. దీంతో కేసును టేకప్ చేసి సిట్ అదిఆకారులు ఆరోపణలు ఉన్న ప్రతి సెలబ్రిటీని ప్రత్యేకంగా విచారించారు.

వారి నుండి వెంట్రుకలు, చేతి గోళ్లు నమూనాలు, ఇతర ఆధారాలు సేకరించి సమగ్ర దర్యాప్తు చేపట్టి తాజాగా నాలుగు సీజర్జ్ షీట్లు దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్లలోని ఏ ఒక్కదాంట్లో కూడా గతంలో ఆరోపణలు ఎదుర్కొని, విచారణకు హాజరైన 62 మంది పరిశ్రమకు చెందిన వ్యక్తుల పేర్లను చేర్చలేదు సిట్ అధికారులు. అంటే సినీ తారలకు, డ్రగ్స్ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని సిట్ నిర్దారించనట్టే అనుకోవాలి.

సంబంధిత సమాచారం :

More