“సీతా రామం” మ్యాజిక్..థియేటర్స్ లో పెరుగుతున్న క్రేజ్..!

Published on Aug 7, 2022 10:00 am IST

ఈ వారం థియేటర్స్ లో మంచి అంచనాలతో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ మరియు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ సినిమా “సీతా రామం” కూడా ఒకటి. దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను అందుకొని ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ టాక్ ని తెచ్చుకుంది.

అంతే కాకుండా చాలా రోజులు తర్వాత ఒక మంచి సినిమా చూసాం అనే భావన కూడా ఆడియెన్స్ కి మిగిల్చింది.దీనితో ఈ సినిమా మ్యాజిక్ కి థియేటర్స్ లో ఆదరణ మరింత పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొదటి రోజు కంటే బెటర్ వసూళ్లు షో లు కూడా తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో కూడా యాడ్ అవుతున్నట్టుగా ఈ సినిమా విషయంలో తెలుస్తుంది. దీనితో అయితే ఈ సినిమా మాత్రం అదరగొడుతుందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :