ఓటిటిలో “సీతా రామం” స్ట్రీమింగ్ ఇందులోనే..!

Published on Aug 6, 2022 2:00 am IST

ఈ వారం థియేటర్స్ లోకి మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ మరియు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ల కాంబోలో వచ్చిన ప్రేమ కథా చిత్రం “సీతా రామం” కూడా ఒకటి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్స్ లోకి వచ్చి మంచి టాక్ ను కూడా సంతరించుకుంది. మరి ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ ఓటిటి లో ఎవరితో డీల్ కుదుర్చుకున్నారో రివీల్ అయ్యింది.

తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో ఓటిటి హక్కులని అయితే ఈ చిత్రం ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి చిత్రం కూడా దాదాపు 8 నుంచి 10 వారాల తర్వాతే ఓటిటి లో స్ట్రీమింగ్ కి రావచ్చు. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా, తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్ మరియు సుమంత్, భూమిక తదితరులు కీలక పాత్రల్లో నటించగా వైజయంతి మూవీస్ సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :