సీత ఈసారి పక్కా .. !

Published on May 5, 2019 4:45 pm IST

కవచం తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ రెండవ సారి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’ గత ఈనెల 25న విడుదలకావాల్సి ఉండగా అవెంజర్స్ ఎండ్ గేమ్ వల్ల వాయిదా వేయాల్సివచ్చింది. ఇక ఈ సినిమాను మే 24న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ స్పెషల్ సాంగ్ లో కనిపించనుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవల వరుస పరాజయాలతో కొనసాగుతున్న సాయి శ్రీనివాస్ కు ఈ సినిమా విజయం కీలకం కానుంది.

సంబంధిత సమాచారం :

More