రేపు విడుదలకానున్న సీత ట్రైలర్ !

Published on May 9, 2019 4:25 pm IST

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’. ఈచిత్రం యొక్క ట్రైలర్ ను రేపు ఉదయం 10 గంటలకు యూ ట్యూబ్ లో విడుదలచేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ ట్రైలర్ ను మహర్షి సినిమాతో థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.

ఈసినిమాలో మన్నార చోప్రా , సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈచిత్రం మే 24న విడుదలకానుంది. ఇక కవచం తరువాత సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటించడం ఇది రెండవ సారి. మరి ఈ చిత్రంతోనైనా వీరిద్దరు హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More