సీత ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది !

Published on May 10, 2019 10:15 am IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సీత’. ఈచిత్రం యొక్క ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. ఇక ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమా ఫై అంచనాలను క్రియేట్ చేసింది. ట్రైలర్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో ఎమోషనల్ కంటెంట్ తో కథ అంత సీత పాత్ర చుట్టూనే తిరుగుతుంది. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొత్తానికి యాక్షన్ , ఎంటర్టైన్మెంట్ , ఎమోషన్స్ ను కల గలిపి కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమా కు మంచి బజ్ ను తీసుకువచ్చేలా వుంది. మరి ఈ చిత్రంతోనైనా సాయిశ్రీనివాస్ హిట్ కొడతాడోలేదో చూడాలి.

ఈసినిమాలో మన్నార చోప్రా , సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈచిత్రం మే 24న విడుదలకానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి !

సంబంధిత సమాచారం :

More