వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “సీతారామం”…త్వరలో!

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “సీతారామం”…త్వరలో!

Published on Nov 6, 2022 11:04 PM IST


దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన పీరియడ్ రొమాంటిక్ డ్రామా సీతారామం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అవుతోంది.

త్వరలో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రసారం కానుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ ల పై అశ్వని దత్ నిర్మించిన ఈ చిత్రం లో రష్మిక మందన్న, సుమంత్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు