తమన్నా సాంగ్ కి సితార స్టెప్స్, వైరల్ అవుతున్న వీడియో

Published on Feb 14, 2020 7:36 am IST

మహేష్ గారాల పట్టి సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురితో కలిసి ఓ యూ ట్యూబ్ ఛానల్ కూడా నడుపుతుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని డాంగ్ డాంగ్ సాంగ్ లో తమన్నా మహేష్ ఇరగదీశాడు. ఇప్పుడు అదే సాంగ్ కి సితార క్యూట్ స్టెప్స్ వేసి అలరించింది. కాస్ట్యూమ్ విషయంలో కూడా తమన్నాను ఫాలో అయిన సితార డాంగ్ డాంగ్ పాటకి సూపర్ స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఫ్యామిలీ తో లాంగ్ వెకేషన్ లో ఉన్న మహేష్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. రెండు నెలలకు పైగా అక్కడ గడపనున్న మహేష్ మే నుండి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More