ఈ సారి బిగ్ బాస్ బోరింగ్ అంటున్న బిగ్ బాస్ విన్నర్

Published on Oct 20, 2019 2:03 am IST

తెలుగు బిగ్ బాస్ షో పై ఆసక్తికర కామెంట్ చేశారు నటుడు శివ బాలాజీ. ప్రస్తుత సీజన్ అంత ఆసక్తిగా సాగడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వచ్చిన బిగ్ బాస్ షో గ్రాండ్ సక్సెస్ ఐయ్యింది. అప్పటికి ఇలాంటి రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినప్పటికీ ఎన్టీఆర్ తన ప్రతిభతో రక్తి కట్టించారు. ఆ సీజన్లో నటుడు శివ బాలాజీ షో విన్నర్ గా నిలిచారు.

కాగా ప్రస్తుత బిగ్ బాస్ షో గురించి ఆయనను ఓ ఇంటర్వ్యూ లో అడుగగా ఆయన అసలు బిగ్ బాస్ షో చూడడం లేదన్నారు. ఈ షో లో ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యిందట అందుకే చూడట్లేదు అన్నారట. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ బాలాజీ మాట్లాడుతూ.. నాకు ఎంటర్‌టైన్మెంట్ అంటే ఇష్టం. అదెక్కడా ఈ సీజన్‌లో నాకు కనిపించలేదు. అందుకే నాకు ఈ సీజన్ కనెక్ట్ కాలేదు. కొన్ని ఎపిసోడ్‌లు చూశా.. ఇప్పుడు బిజీగా ఉండటం వల్ల చూడటం మానేశా’ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

X
More