తమిళ స్టార్ హీరో తెలుగు ఆడియో ఈరోజే !

1st, November 2016 - 09:21:44 AM

remo
వరుస విజయాలతో తమిళంలో సరికొత్త స్టార్ హీరోగా అవతరించిన శివ కార్తికేయన్, తాజాగా చేసిన ‘రెమో’ తమిళంలో ఈ మధ్యే విడుదలై ఘన విజయం సాదించింది. ఇందులో శివకార్తికేయన్ ట్రాన్స్‌జెండర్‌గా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేపథ్యంలోనే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకూ అందించాలన్న ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ‘రెమో’ తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం యొక్క ఆడియో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్లో భారీ ఎత్తున జరగనుంది.

మొదటిసారి శివకార్తికేయన్ చిత్రం తెలుగులోకి విడుదల అవుతుండటంతో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గట్టి ప్రమోషన్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘నేను శైలజా’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్టయిన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడంతో తెలుగులో సైతం ఈ సినిమాపై క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇకపోతే బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, అనిరుద్ సంగీతం సమకూర్చారు.