ఆ ఆరుగురిలో బిగ్ బాస్ కి బై చెప్పేది ఎవరు?

Published on Aug 27, 2019 4:19 pm IST

తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతుంది. ఇప్పటికి ఐదు వరాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో విజయవంతంగా ఆరవ వారంలోకి ప్రవేశించింది. ఈ వారంలో ఏలిమినేట్ అయిన ఆషురెడ్డి తో కలిపి మొత్తం షో నుండి ఇప్పటికీ ఐదుగురు బయటకు వెళ్లడం జరిగింది. ఇక ఈ వారం కొరకు హిమజ, మహేష్, పునర్నవి, రవికృష్ణ, రాహుల్, వరుణ్ సందేష్ మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ కావడం జరిగింది. దీనితో ఈ వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారింది.

ఈ ఆరుగురిలో అత్యంత తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న రాహుల్, పునర్నవి, మహేష్ విట్టాలకే ఎలిమినేషన్ ప్రమాదం పొంచివుంది. హీరో గ్లామర్ ఉన్న వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇంటి కెప్టెన్ శివ జ్యోతి వితిక షేరును నామినేట్ చేసివుంటే ఆమె ఈవారం ఎలిమినేట్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉండేవి. మరి ఈ ఆరుగురిలో ఈ వారం ఎవరు బట్టలు సర్దుకోనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :