పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన సూర్య !
Published on Sep 27, 2017 5:30 pm IST


తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ‘స్పైడర్’ చిత్రం ఈరోజే భారీ ఎత్తున విడుదలైంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా దర్శకుడు, నటుడు అయిన ఎస్.జె సూర్య నటించారు. ఈయన నటనే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మురుగదాస్ ఎంతో ఇష్టపడి రాసిన ఈ పాత్రకు సూర్య నూటికి నూరుశాతం న్యాయం చేశాడు. సైకిక్ పాత్రలో ఇంతకు ముందెన్నడూ దక్షిణాది ప్రేక్షకులు చూడని విలన్ ను చూపించారు.

సినిమా చూసిన ప్రేక్షకులంతా సినిమాలో ఏది బాగుంది అంటే మొదటగా ఎస్ జె సూర్య నటననే చెబుతున్నారు. రెగ్యులర్ విలన్లలా కాకుండా ఆయన కనబర్చిన కొత్త బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ముఖ కవళికలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విమర్శకుల నుండి కూడా సూర్య రూపంలో సౌత్ కు మరొక మంచి ప్రతి నాయకుడు దొరికాడనే అభిప్రాయాలు కూడా వెల్లడవురుతున్నాయి. ఈ ఫీడ్ బ్యాక్ తో ఇకపై ఆయనకు ఇలాంటి భిన్నమైన అవకాశాలు రావడం ఖాయం. మరి సూర్య ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటారో చూడాలి.

 
Like us on Facebook