‘కలర్ ఫోటో’ అందరికీ నచ్చుతుంది !

‘కలర్ ఫోటో’ అందరికీ నచ్చుతుంది !

Published on Oct 19, 2020 2:40 PM IST

కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం కలర్ ఫోటో. ఈ మూవీలో నటుడు సునీల్ సీరియస్ విలన్ గా, చాందిని చౌదరి హీరోయిన్ గా చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో నిర్మాత యస్.కె.ఎన్ మాట్లాడుతూ.. “వంద ఏళ్ల క్రితం ప్లేగు వచ్చినా, తోబ్బై ఏళ్ల క్రితం ప్ల్యూ వచ్చినా సినిమా ఆగలేదు. ఇప్పుడు కరోనా వచ్చినా.. ఇంకా ఎన్ని వచ్చినా సినిమా ఆగదు. ఇక ఓటీటీలు ఉన్నా.. థియేటర్లు ఎప్పటికీ ఉంటాయి. ఈ కలర్ ఫోటో సినిమా నా స్వంత సినిమాలాంటిది. ఈ సినిమా నిర్మాత రాజేష్ తో అలాగే ఈ సినిమా డైరెక్టర్ సందీప్ తో నా తరువాత సినిమాలను నిర్మించబోతున్నాను.

ఇక సుహాస్ చాలా బాగా నటించాడు. చాందిని చౌదరి కాబట్టే ఆమె ఇలా ఉంది. అదే చాందిని అగర్వాల్ అయి ఉంటే ఎప్పుడో పెద్ద హీరోయిన్ అయిపోయి ఉండేవారు. అలాగే కీరవాణిగారి వారసత్వాన్ని కాలభైరవ అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఈ సినిమా నేను చూశాను. సునీల్ గారితో సహా అందరూ తమ పాత్రల్లో జీవించేసేశారు. సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని తెలిపారు. కాగా హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాల నిర్మాత-దర్శకుడు సాయి రాజేష్ ఈ ‘కలర్ ఫోటో’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు