టాక్..”అఖండ” ప్రీ రిలీజ్ లో మార్పులు.?

Published on Nov 20, 2021 10:00 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాగా “అఖండ” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఉన్న గ్యాప్ లో సినిమా ప్రీ రిలీజ్ కి డేట్ మరియు వేదికలను మేకర్స్ ఫిక్స్ చేస్తున్నారని టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ లో కొన్ని మార్పులు ఉన్నాయని టాక్. మొదటగా విశాఖలో ఈ ప్రీ రిలీజ్ ఉండొచ్చని స్ట్రాంగ్ బజ్ ఉండగా ఇప్పుడు ఇందులో మార్పు చోటు చేసుకుంది.

ఈ వేడుక హైదరాబాద్ శిల్ప కళావేదిక లో చెయ్యాలని ఫిక్స్ చేశారట. మరి వాతావరణ మార్పులు దీనికి కారణమేమో కానీ హైదరాబాద్ లో ఈ వేడుకలు వచ్చే 27 కానీ 28న కానీ జరగనున్నట్టు ఇప్పుడు సమాచారం. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More