టాలీవుడ్ లో గతకొన్ని వారాలుగా పెద్ద సినిమాలు విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద రాజ్యమేలాయి. ఇప్పుడు తమవంతంటూ చిన్న సినిమాలు వరుసపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీగా వున్నాయి. దిక్కులు చూడకు రామయ్య, పాటశాల మరియు రోమియో సినిమాలు ఈ నెల 10న విడుదలకానున్నాయి
కొత్తరకం కాన్సెప్ట్ తో, కీరవాణి సంగీతంతో రాజమౌళి అసిస్టెంట్ త్రికోటి దర్శకుడు అన్న బ్రాండ్ తో దిక్కులు చూడకు రామయ్య సినిమా మంచి అంచనాలను నెలకొల్పింది. రోమియో సినిమాతో సాయి రామ్ శంకర్ తిరిగి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. పూరి ఈ సినిమాకు కధని అందించడం ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్
పాటశాల సినిమా యూత్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. నందు వంటి నటులు ఈ సినిమాలో పాలుపంచుకున్నారు. కాబట్టి సినిమా ప్రియులకు ఈ వారంతరం మంచి టైం పాస్ అని చెప్పచ్చు. చూద్దాం వీటిలో ఏ సినిమా హిట్ అవుతుందో..ఏ చిత్రం ప్రేక్షకుల మదిని దోచుతుందో..


