స్మాల్ స్క్రీన్ స్టార్ సుడిగాలి సుధీర్ కు కరోనా పాజిటివ్!

Published on Oct 21, 2020 3:00 pm IST

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే టాప్ కమెడీ షో “జబర్దస్త్”తో తెలుగు స్మాల్స్ స్క్రీన్ పై అపారమైన క్రేజ్ ను తెచ్చుకొని హీరోగా మారిన కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇప్పటికీ తన షోలు మరియు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ మూలాన ఆ మధ్య అంతా షోలకు దూరంగా ఉన్న సుధీర్ తర్వాత మళ్ళీ తన షోలతో బిజీ అయ్యారు.

అయితే అశేష బుల్లితెర వీక్షకుల అభిమానాన్ని యూత్ లో మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ నటుడు కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. దీనితో హోమ్ క్వారంటైన్ లో ఉన్న సుధీర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడట. అలాగే అతని సన్నిహతులు మరియు కుటుంబీకులు అంతా నెగిటివ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పలు సినిమాలకు కమిట్ అయిన సుధీర్ త్వరగా కోలుకొని మళ్ళీ ఎంటర్టైన్ చెయ్యాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :

More