ఇంకొద్దిసేపట్లో సప్రైజ్ ఇవ్వనున్న పవన్ టీమ్ !
Published on Nov 23, 2017 5:29 pm IST

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కానుకలో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే నిర్మాణ సంస్థ హారికా, హాసిని క్రియేషన్స్ సంస్థ ఇంకొద్దిసేపట్లో సినిమాకు సంబందించిన ఒక విశేషాన్ని బయటపెట్టబోతున్నామని ప్రకటించింది.

ఇంతకీ ఆ అప్డేట్ సినిమా టైటిల్ గురించి అయ్యుంటుందా లేకపోతే టీజర్, ట్రైలర్ల గురించి అయ్యుంటుందా అనేది ఇంకా తెలియలేదు. కాబట్టి అప్డేట్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని అందివ్వనుండగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook