ధనుష్ మరో తెలుగు ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యినట్టేగా.!

Published on Jul 28, 2021 7:00 pm IST

కోలీవుడ్ విలక్షణ నటుల్లో ఒకరైన హీరో ధనుష్ పుట్టినరోజు ఈరోజు కావడంతో అటు తమిళ్ మరియు మరియు తెలుగు ఆడియెన్స్ లో కూడా అతనికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సరే ఇదిలా ఉండగా ధనుష్ బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమాలకి సంబంధించి అప్డేట్స్ కూడా కొన్ని వచ్చాయి.

అయితే ధనుష్ నుంచి మొట్టమొదటి తెలుగు ప్రాజెక్ట్ శేఖర్ కమ్ములతో ఆల్రెడీ ఫిక్స్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక ట్రై లాంగువల్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేసిన దీని తర్వాత కూడా తెలుగులో మరో ప్రాజెక్ట్ ని చేస్తున్నాడని టాక్ వచ్చింది. పైగా ఆ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తాడని బజ్ వినిపించగా ఇప్పుడు అది కన్ఫర్మ్ అని తెలుస్తుంది.

తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన విషెష్ తో అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే తెలుగులో మరొకటి అని అర్ధం అయ్యింది కానీ దర్శకుడు పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రం కూడా ట్రై లాంగువల్ ప్రాజెక్ట్ గానే విడుదల అవుతుంది అని ఊహాగానాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :