
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సూపర్‌హిట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘S/O సత్యమూర్తి’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ యాక్టింగ్‌కు, త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. మొదటి రెండు వారాలు కలెక్షన్లను కుమ్మేసిన సత్యమూర్తి మూడో వారం కూడా మంచి కలెక్షన్లనే రాబడుతోంది. సమంత, నిత్యామీనన్, అదాశర్మలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
‘S/O సత్యమూర్తి’ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ రికార్డు కలెక్షన్లతో దుమ్ము దులుపుతోంది. ఇప్పటివరకూ (మూడో వారాంతం వరకూ) ఈ సినిమా నైజాం ఏరియాలో సుమారు రూ. 13 కోట్లు సాధించింది. ఇక అమెరికాలో దాదాపుగా 1,254,699 డాలర్లు (సుమారు 7.96కోట్ల రూపాయలు) వసూలు చేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. హారిక ఆన్డ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.

