సూర్య ‘జై భీమ్‌’లో సోషల్ మెసేజ్ !

Published on Jul 24, 2021 8:50 am IST


తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న 39వ సినిమా ‘జై భీమ్‌’. నిన్న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. జె. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉందట. భూముల కోసం పోరాడే పేదలకు అండగా నిలబడే పవర్‌ఫుల్‌ లాయర్‌గా ఆయన కనిపించనున్నారు.

ఇక ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సూర్యా శివకుమార్‌ నిర్మిస్తున్నారు. రజీషా విజయన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్, రావు రమేష్, మణికందన్, జయప్రకాశ్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌. మరి ఈ సినిమా పోస్టర్లో సూర్య లాయర్‌గా కనిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :