కర్ణాటక లొకేషన్స్ కి ‘సోగ్గాడే చిన్ని నాయనా’

కర్ణాటక లొకేషన్స్ కి ‘సోగ్గాడే చిన్ని నాయనా’

Published on May 18, 2015 8:05 PM IST

soggade_chinni_nayan-(1)
అక్కినేని నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కంటిన్యూ షెడ్యూల్స్ వల్ల నాగార్జున చాలా బిజీ బిజీగా ఉన్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాని చివరిదశకు తీసుకు వచ్చాడు. అలాగే నాగార్జున, కార్తీ తో కలిసి వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేసాడు. ఇటీవలే సోగ్గాడే చిన్ని నాయనా లోని మెయిన్ పార్ట్ ని మైసూర్ లో షూట్ చేసారు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయిన నాగార్జున ఈపుదు మళ్ళీ సోగ్గాడుగా మారడానికి సిద్దమవుతున్నాడు.

సోగ్గాడే చిన్ని నాయనా లేటెస్ట్ షెడ్యూల్ ని కర్నాటకలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ జూన్ 1 నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో నాగార్జున లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణలతో రొమాన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో నాగార్జున మరదలిగా హాట్ యాంకర్ అనసూయ కనిపించనుంటే, హంసా నందిని కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.

తాజా వార్తలు