ఇప్పుడు నడుస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ లో యాంగ్రీ యంగ్ మెన్ ఎవరన్నా ఉన్నారు అంటే అంతా సోహెల్ ఒక్కడి పేరునే చెప్తారు. ఆ రేంజ్ లో సోహెల్ కోపాన్ని బిగ్ బాస్ హౌస్ మేట్స్ అలాగే ఆడియెన్స్ రుచి చూసారు. దీనితో సోహెల్ కు ఆ ముద్ర పడిపోయింది. అయితే సోహెల్ ఎంత కోపాన్ని కలిగి ఉన్నవాడో అంతకు మించిన ఎమోషనల్ పర్సన్ అని కూడా నిన్నటి ఎపిసోడ్ లో చాలా మందికి అర్ధం అయ్యి ఉండొచ్చు. సోహెల్ పై బిగ్ బాస్ ప్లే చేసిన వీడియో చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు.
అంతే కాకుండా తాను చేసిన సినిమాలకు జనం లేరు అంటే తానే టికెట్లు కొనుకొని వెళ్లిన సందర్భాలు, సరైన గుర్తింపు రాకపోవడం వంటివి ఎదుర్కొన్నానని కానీ ఈ బిగ్ బాస్ అనే షో వల్ల మాత్రమే సోహెల్ అనే వ్యక్తి కోట్లాది మంది ప్రజలకు చేరువయ్యాడు అని బిగ్ బాస్ కు స్పెషల్ గా థాంక్స్ చెప్పుకున్నాడు. అంతే కాకుండా తనకి సినిమా తప్ప ఏ పని కూడా తెలియదు అని ఇక్కడ నుంచి వచ్చిన గుర్తింపుతో బయటకు వెళ్లినా ప్రతీ ఒక్కరు తనని ఆదరిస్తారని నమ్మకం ఉందని దాని ముందు టైటిల్ రాకపోయినా పర్వాలేదని సోహెల్ ఎన్నడూ లేని విధంగా ఎమోషనల్ అయ్యాడు.


