డే 1 సాలిడ్ వసూళ్లు రాబట్టిన “సోలో బ్రతుకే సో బెటర్”.!

డే 1 సాలిడ్ వసూళ్లు రాబట్టిన “సోలో బ్రతుకే సో బెటర్”.!

Published on Dec 26, 2020 12:06 PM IST

solo bathuke
ఎన్నో అనుమానాల నడుమ చాలా కాలం అనంతరం విడుదల కాబడిన టాలీవుడ్ చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, అలాగే నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ కోవిడ్ సమయంలోనే థియేటర్స్ లో విడుదలయ్యి సాహసం చేసింది. మరి వీరు తీసుకున్న ఈ నిర్ణయానికి ఆడియెన్స్ కూడా జై కొట్టారు.

అది కూడా ఏ రేంజ్ లో ఉంది అన్నాయి మొదటి రోజు వసూళ్లు చూస్తే అర్ధం అవుతుంది. లేటెస్ట్ గా వచ్చిన పి ఆర్ వసూళ్ల వివరాలు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 4.7 కోట్ల గ్రాస్ వసూలు అయ్యినట్టుగా చెబుతున్నారు. అది కూడా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ మరియు ఎన్నో నిబంధనలతో సాయి తేజ్ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ దక్కడం విశేషం. మొత్తానికి మాత్రం వీరి టీం చేసిన ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యినట్టే అని చెప్పాలి.

ఇక ఏరియాల వారీగా పి ఆర్ లెక్కలను చూస్తే..

నైజాం – 1.84 కోట్లు
వైజాగ్ – 0.57 కోట్లు
నెల్లూరు – 0.20 కోట్లు
కృష్ణ – 0.21 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.25 కోట్లు
గుంటూరు – 0.43 కోట్లు
తూర్పు గోదావరి – 0.34 కోట్లు
సీడెడ్ – 0.86 కోట్లు

మొత్తం – 4.70 కోట్లు గ్రాస్ ను ఈ చిత్రం రాబట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు