‘డియర్ కామ్రేడ్’ సాలిడ్ ప్రీనియర్ కలెక్షన్స్

Published on Jul 27, 2019 1:02 am IST

భారీ అంచనాల నడుమ విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మార్నింగ్ షోస్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓవర్సీస్లో సైతం మంచి ఓపెనింగ్స్ సాదించింది. గురువారం ప్రీమియర్ల ద్వారా 310,000 డాలర్లను వసూలు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈరోజు శుక్రవారం కూడా వసూళ్లు గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది.

ఇక రేపు, ఎల్లుండి వీకెండ్ కావడంతో వసూళ్లు ఇలాగే బలంగా సాగనున్నాయి. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. రష్మిక మందన్న కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇక దేవరకొండకు మంచి ఫాలోయింగ్ ఉన్న నైజాం ఏరియాలో మొదటిరోజు వసూళ్లు భారీగానే ఉండనున్నాయి.

సంబంధిత సమాచారం :