‘ఆచార్య’లో పవర్ ఫుల్ పొలిటికల్ సెటైర్స్ !

‘ఆచార్య’లో పవర్ ఫుల్ పొలిటికల్ సెటైర్స్ !

Published on Jul 17, 2021 9:09 PM IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో కొన్ని పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయట. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకు సంబంధించిన కొన్ని వ్యంగ్యాస్త్రాలు చిరు డైలాగ్స్ లో ఉంటాయని, కొరటాల ఈ డైలాగ్స్ ను చాల బలంగా రాశారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. కొరటాల రాసిన కథలో సహజంగానే బోలెడంత హీరోయిజమ్ ఉంటుందట. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు