సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్న “ఖిలాడి”.!

Published on Feb 9, 2022 1:00 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఖిలాడి” ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. క్రాక్ లాంటి సాలిడ్ అందుకున్నాక రవితేజ సినిమా చేసిన సినిమా ఇది కావడంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో పైగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

మరి నిన్న వచ్చిన ఈ సినిమా తాలూకా ట్రైలర్ తో ఈ చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఇప్పుడు అయితే ఈ సినిమాకి జారుతున్న బిజినెస్ పై ఇంట్రెస్టింగ్ వార్తలే వినిపిస్తున్నాయి. ఏరియాల వారీగా ఖిలాడి అయితే సాలిడ్ బిజినెస్ ను జరుపుతుందట. అలాగే ఆల్రెడీ నైజాం లో ఈ చిత్రానికి 8 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాపై ఇప్పుడు మంచి అంచనాలే నెలకొన్నాయి మరి వచ్చే 11న రిలీజ్ అయ్యే సినిమా ఏ రేంజ్ ట్రీట్ ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :