“పుష్ప”రాజ్ ఢీ కొట్టే సాలిడ్ విలన్ ఇతడేనా.?

Published on Nov 26, 2020 2:00 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనింగ్ చిత్రం “పుష్ప”. ఈ చిత్రం ఆరంభమే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ అయిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా ఈ చిత్రాన్ని సుకుమార్ పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తుండడంతో అంచనాలు కూడా అంతే పీక్స్ లో ఉన్నాయి.

అయితే ఈ చిత్రంలో హీరో రోల్ కు తగ్గ సాలిడ్ విలన్ రోల్ కోసం మాత్రం ఇంకా వేట కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అయితే సుకుమార్ తమిళ్ నుంచే ఒక ప్రముఖ నటుణ్ని తీసుకోవాలని ముందు నుంచి అనుకున్నారు. అందుకే తమ మొట్ట మొదటి ఛాయిస్ గా మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఒకే చేసారు. కానీ కొన్ని కారణాల చేత ఈ నటుడు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు.

ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఇపుడు అలాంటి సాలిడ్ రోల్ ను చేసేందుకు ఓ సాలిడ్ పర్సనాలిటీను అనుకుంటున్నారని ఇప్పుడు గట్టి బజ్ అతడు మరెవరో కాదు తమిళ్ విలక్షణ నటుడు “చియాన్” విక్రమ్ అన్నట్టు వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ఒకవేళ ఈ కాంబో కనుక సెట్టయితే బన్నీ మరియు విక్రమ్ ల నడుమ యాక్షన్ సీన్స్ మరో లెవెల్లో ఉంటాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More