సూపర్ స్ట్రాంగ్ గా “సోలో బ్రతుకే సో బెటర్” వసూళ్లు.!

సూపర్ స్ట్రాంగ్ గా “సోలో బ్రతుకే సో బెటర్” వసూళ్లు.!

Published on Dec 27, 2020 11:01 AM IST

SoloBrathukeSoBetter

ఈ కరోనా సమయంలోనే నిబంధనల సూచనలతో ధైర్యం చేసి థియేటర్స్ లో విడుదల కాబడిన చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. సాయి ధరమ్ తేజ్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా సుబ్బు దర్శకత్వంలో విడుదల కాబడిన ఈ చిత్రంకు ఆడియెన్స్ బంపర్ రెస్పాన్స్ ను అందించారు.

క్రిస్మస్ కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రానికి మొదటి రోజు అందులోనూ కేవలం 50 శాతం సీటింగ్ తోనే అదిరిపోయే వసూళ్లను ఇవ్వగా ఇప్పుడు రెండో రోజు కూడా ఈ చిత్రం అంతే స్ట్రాంగ్ గా నిలబడినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొదటి రోజు 4.7 కోట్లు గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజున 3.29 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక అలాగే ఏరియాల వారీగా చిత్రం వసూళ్లను పి ఆర్ లెక్కల ఆధారంగా చూస్తే..

నైజాం – 1.19 కోట్లు
సీడెడ్ – 0.59 కోట్లు
గుంటూరు – 0.26 కోట్లు
నెల్లూరు – 0.13 కోట్లు
కృష్ణ – 0.18 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.15 కోట్లు
తూర్పు గోదావరి – 0.24 కోట్లు
వైజాగ్ – 0.55 కోట్లు

మొత్తం రెండో రోజు 3.29 కోట్లు గ్రాస్ వసూలు కాగా రెండు రోజులకు కలిపి ఈ చిత్రానికి 7.99 కోట్లు గ్రాస్ రాగా 4.8 కోట్ల షేర్ ను అందుకుంది. ఇక ఈ సోమవారం నుంచి అసలు టెస్ట్ మొదలు కానుంది. అప్పుడు కూడా ఇంతే స్ట్రాంగ్ గా నిలబడితే ఈ చిత్రం ఈజీగా ఇలాంటి సమయంలో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు