సేతుపతిని దారుణంగా టార్చర్ చేస్తున్నారు.!

Published on Oct 20, 2020 5:30 pm IST

కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ బయో పిక్ “800” ఒప్పుకోవడమే అతని పాలిట శాపంలా మారింది. ఈ చిత్రం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సేతుపతికి తమిళ జనం తీవ్రస్థాయిలో హెచ్చరింపులు జారీ చేసారు. అయితే అవి రోజురోజుకూ మితి మీరాయి.

దీనితో విజయ్ తప్పుకోవాలని ముత్తయ్య కోరడంతో విజయ్ తాను ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించారు. అయితే అలా తప్పుకున్నప్పటికీ సేతుపతికి దారుణమైన హెచ్చరింపులు నెటిజన్లు ఇస్తుండడం కలకలం రేపింది. సేతుపతి తప్పుకుంటున్నాని చెప్పిన పోస్టింగ్ లో తన చిన్న కూతురిపై అత్యాచారం చేస్తామని బెదిరింపులకు కూడా తెగించారు.

ఇక ఇంత కన్నా దారుణం ఏముంటుంది అని మరికొంత మంది సెలెబ్రెటీలు మరియు సేతుపతి సానుభూతిపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపైనే మన టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేసి ఆ కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీసులను కోరారు. ఇప్పుడు అతడిని పట్టుకునే పనిలో చెన్నై పోలీసులు నిమగ్నం అయ్యి ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More