సోనూ సూద్ పై ఐటీ దాడులు..తెరపైకి సరికొత్త కారణాలు?

Published on Sep 22, 2021 7:00 am IST


గత రెండేళ్ల కరోనా సంక్షోభంలో ఎవరూ ఊహించని విధంగా ప్రముఖ నటుడు సోనూ సూద్ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగింది.. ఎక్కడికి అంటే అక్కడికి కాదు అనకుండా ఎలాంటి సాయాన్ని అయినా అందించిన సోనూ సూద్ రీల్ గా విలన్ అయినా రియల్ లైఫ్ లో మాత్రం సిసలైన హీరోగా నిలిచాడు. అయితే ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు కితం సోనూ సూద్ పై ఆకస్మిక ఐటీ దాడులు జరగడం అందులో తాను 20 కోట్ల మేర పన్ను చెల్లించలేదు అని టాక్ బయటకి రావడం వైరల్ అయ్యింది.

అయితే ఎంతో మందిని వదిలి సడెన్ గా సోనూ సూద్ పైనే ఈ దాడులు జరగడం కాస్త అనుమానకరంగానే మారింది. మరి దీనికి కారణం పొలిటికల్ గా కొన్ని ఉన్నాయని తెలుస్తోంది. అతనికి రాజ్యసభలో స్థానం కల్పిస్తామని ఆహ్వానం రాగా దానికి సోనూ నో చెప్పడానికి ఓ కారణం వినిపిస్తుండగా సోనూసూద్ ప్రస్తుతం తన సినిమాలు మరోపక్క సాయాలు. చేస్తూ బిజీగా ఉండడంతో ఎన్నో మెయిల్స్ తాను చూసుకోకపోవడం మూలన కూడా ఈ దాడులు జరిగాయని వినిపిస్తోంది. మొత్తానికి మాత్రం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యిన ఈ అంశం నుంచి సోనూసూద్ బయటపడి మళ్లీ యథావిధిగా తన సాయం అందిస్తూనే ఉన్నాడు..

సంబంధిత సమాచారం :