
అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ఇప్పటికే ప్రచార చిత్రాల ద్వారా, ట్రైలర్ ద్వారా ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, విడుదలకు ముందే సంచనాలను నమోదు చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సినిమా యూనిట్ బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలన్నీ కూడా హిట్‌గా నిలిచాయి.
ఇక తాజా సమాచారం మేరకు గతంలో జులాయి సినిమాకు చేసినట్టుగానే సన్నాఫ్ సత్యమూర్తికి కూడా ఓ ప్రమోషన్ పాటను తెరకెక్కించే ఆలోచన చేస్తోంది సినిమా యూనిట్. జులాయి సినిమాలోని ‘పకడో పకడో’ అన్న పాటకు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, హీరో అల్లు అర్జున్లపై ఓ ప్రమోషన్ పాటను తెరకెక్కించారు త్రివిక్రమ్. ఆ ప్లాన్ అప్పట్లో బాగా వర్కవుట్ అయింది. సినిమాని ప్రేక్షకుడికి చేర్చడంలో ఆ పాట కొంత ఉపయోగపడింది. ఇక సన్నాఫ్ సత్యమూర్తికి కూడా ఇలాగే చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన పనుల్లో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

