సూపర్ స్టార్ రజినీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా నటినటులుగా రూపొందుతున్న సినిమా ‘లింగ’. ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ సోమవారం సాయంత్రంతో పూర్తయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో రజిని, సోనాక్షి సిన్హాలపై గత కొన్ని రోజుల నుండి పాటను చిత్రీకరిస్తున్నారు. నేటితో ఆ పాట షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఆ పాటతో సోనాక్షి సిన్హా తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసింది.
‘లింగ’ షూటింగ్ పూర్తి చేశాను. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన సూపర్ స్టార్ రజినీకాంత్ & ‘లింగ’ టీం సభ్యులు అందరికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేశాను, కొత్త విషయాలు నేర్చుకున్నాను’ అని సోనాక్షి సిన్హా ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
ఈ సినిమాలో మరొక పాట చిత్రీకరించాల్సి ఉంది. యూరోప్ లో రజిని, అనుష్కలపై ఆ పాటను తెరకేక్కిస్తారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఏఅర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.


