
ఎంతో ప్రతిభగల బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా దక్షిణాదిలో రజని ‘లింగా’ చిత్రం ద్వారా అడుగుపెట్టనుంది. ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్న సోనాక్షి సౌత్ మూవీ కల్చర్ తో ఎంతో అనందంగా వుంది. అందువల్ల దక్షిణాదిలో మరిన్ని చిత్రాలలో నటించాలనుకుంటుంది.
ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “నేను తమిళ్ లో ఇంతకన్నా మంచి చిత్రంతో పరిచయం అవుతానని అనుకోవటంలేదు. హిందీలో సల్మాన్ ఖాన్ తో పరిచయం అయిన నేను ఇప్పుడు తలైవర్ రజని కాంత్ తో దక్షిణాదిలో పరిచయం అవ్వడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా వుంది’ అని సోనాక్షి తెలిపింది.
అంతేకాకుండా మహేష్ బాబు రవి తేజ సూర్య లాంటి నటులతో భవిష్యత్తులో నటించాలనివుందని తెలిపింది. సోనాక్షి ఈ ఏడాది బాలీవుడ్ లో మూడు చిత్రాలలో నటించనుంది.
సోనాక్షి అక్షయ్ కుమార్ తో నటించిన ‘హాలిడే’ దక్షిణాదిలో విజయం సాధించిన ‘తుపాకి’ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం ఇంకా విడుదల కావాల్సి వుంది.

