తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించిన సోనమ్ కపూర్

Published on Mar 21, 2022 4:00 pm IST

దేశంలోని టాప్ హీరోయిన్ల లో సోనమ్ కపూర్ ఒకరు. కానీ ఆనంద్ అహూజాతో తన పెళ్లి తర్వాత, సోనమ్ తాను చేస్తున్న సినిమాల సంఖ్యను తగ్గించుకుంది మరియు తన కుటుంబ జీవితంపై దృష్టి పెట్టింది. ఆమె లండన్‌లో తన భర్తతో కలిసి నివసిస్తోంది.

తాజాగా సోనమ్ కపూర్ ఇన్‌స్టాలో ఒక అద్భుతమైన పోస్ట్ చేయడం జరిగింది. తను ప్రెగ్నంట్ గా ఉన్న విషయాన్ని పలు ఫోటోలు రిలీజ్ చేసి వెల్లడించడం జరిగింది. ఈ సంతోషకరమైన వార్తతో, ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోనమ్ కపూర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :