ఆ లక్కీ లేడీని ప్రకటించనున్న కొరటాల…!

Published on Nov 13, 2019 11:04 am IST

సైరా లాంటి భారీ బడ్జెట్ మూవీ తరువాత చిరంజీవి మరో క్రేజీ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమయ్యారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివతో ఓ మూవీ చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించేశారు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈమూవీ కొద్దిరోజులలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ పాత్ర కొరకు చిరు జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తున్నారు. కాగా ఈ మూవీలో చిరు సరసన చేసే లేడీ లీడ్ పెయిర్ పై మాత్రం చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వలేదు.

ఈ మూవీ ప్రకటించినప్పటి నుండి అనేక మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. శృతి హాసన్, నయనతార వంటి తారలు నటించే అవకాశం కలదని పుకార్లు రావడం జరిగింది. తాజాగా త్రిషా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కాగా ఈ పుకార్లకు చెక్ పెడుతూ త్వరలో కొరటాల శివ, చిరు కాంబినేషన్ లో రానున్న మూవీ పూర్తి క్యాస్ట్ అండ్ క్రూ ని ప్రకటించనున్నారట. హీరోయిన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ మిగతా నటీనటులు, ఇలా మొత్తం క్రూ ని ప్రకటించనున్నారని సమాచారం. దీనితో కొద్దిరోజులలో చిరు సరసన చేయనున్న ఆ లక్కీ లేడీ ఎవరో తెలిసిపోనుంది.

సంబంధిత సమాచారం :

More