గాలిలో ఈవెంట్ ప్లాన్ చేసిన సూర్య టీమ్

Published on Feb 11, 2020 10:56 pm IST

తమిళ హీరో సూర్య చేసిన కొత్త చిత్రం ‘సూరరై పొట్రు’. ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకోగా టీమ్ పాటల్ని రెడీ చేస్తున్నారు. చిత్రంలోని రొమాంటిక్ పాటను ఫిబ్రవరి 13న రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ అంటే సాదాసీదాగా కాదు బాగా వెరైటీగా. స్పైస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానంలో ఈ పాటను విడుదల చేయనున్నారు. విడుదలనాటికి విమానం గాలిలో ఎగురుతుంటుందట.

ఈ ప్లాన్ విన్న సూర్య ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ ఫీలవుతున్నారు. ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ ఫౌండర్ పైలట్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ కీలకపాత్ర చేయడం జరిగింది. అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :