పరిష్కారం దొరక్కపోతే మార్చి 1 నుండి థియేటర్లు బంద్ !

పరిష్కారం దొరక్కపోతే మార్చి 1 నుండి థియేటర్లు బంద్ !

Published on Feb 1, 2018 3:27 PM IST

డిజిటల్ ప్రొవైడర్ల విధి విధానాలపై దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. డిజిటల్ ప్రొవైడర్లు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల గురించి ఆలోచించకుండా తమ లాభాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు అందరికీ నష్టాలను మిగులుస్తున్నాయని, ఇకనైనా అందరికీ ఆమోదయోగ్యమైన చార్జీలను వసూలు చేయాలని దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ పలుసార్లు డిజిటల్ ప్రొవైడర్లను కోరారు. కానీ ప్రొవైడర్ల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరసనకు పిలుపునిచ్చారు సినీ పెద్దలు.

ఈ విషయమై నిన్న బుధవారం తెలుగు నిర్మాతలు సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి. కిరణ్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె. మురళీ మోహన్, చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు ఎల్.సురేష్, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు విశాల్, కేరళ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సియాద్ కొక్కర్ తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో సమావేశమయ్యారు.

డిజిటల్ ప్రొవైడర్లు అన్యాయంగా వసూలు చేస్తూ, తక్కువ ధరకు వస్తున్న డిజిటల్ పోవైడర్లను రాకుండా చేస్తున్నారని, దీనిపై ఇంకో వారంలోగా సమావేశానికి కూర్చొని, ధరల తగ్గుదల, ఇతరత్రా విషయాలపై పరిష్కారానికి రావాలని లేనియెడల ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మార్చి 1 నుండి థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు