చైతూ కెప్టెన్ కార్తీక్ గా దేశభక్తి చూపిస్తాడట

Published on Nov 21, 2019 3:47 pm IST

యంగ్ హీరో నాగ చైతన్య కెప్టెన్ కార్తీక్ గా వస్తానంటున్నాడు. ఇప్పటివరకు నాలోని ఫన్ యాంగిల్ చూశారు, ఇప్పుడు నాలోని దేశభక్తిని చూడంటి అంటున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, నాగ చైతన్య, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ వెంకీ మామ. దర్శకుడు కె ఎస్ రవీంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రెండు సాంగ్స్ విడుదల కాగా మంచి ఆదరణ దక్కించుకున్నాయి. కాగా నేడు చిత్ర యూనిట్ నాగ చైతన్య పాత్రపై ఓ అనౌన్స్మెంట్ చేశారు.

అదేమిటంటే ఈనెల 23న వెంకీ మామ సినిమాలోని నాగ చైతన్య చేస్తున్న కెప్టెన్ కార్తీక్ రోల్ కి సంబంధించి ఓ వీడియో విడుదల చేయనున్నారు. చైతూ ఆర్మీ కెప్టెన్ కార్తీక్ గా చేస్తున్న నేపథ్యంలో అతనిలోని దేశభక్తిని తెలిపేదిగా ఈ వీడియో ఉండనుంది. ఐతే అది సన్నివేశమా, సాంగా అనే విషయం పై స్పష్టత ఇవ్వలేదు. ఇక వెంకటేష్ ఈ చిత్రంలో పల్లెటూరిలో ఉండే రైతులా కనిపించనున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More