‘బాలయ్య 105’ ఇంట్రస్టింగ్ అప్ డేట్ రానుందట !

Published on Oct 24, 2019 3:00 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తోన్న 105వ చిత్రం ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మేకర్స్ రేపు ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేక ప్రకటన చేస్తారట. మరి ఆ ప్రకటన ఏమిటో అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుద‌లైన బాలయ్య లుక్‌ కి సంబంధించిన పోస్టర్స్ కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మొత్తానికి బాలయ్య లుక్స్ అండ్ గెటప్స్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More