‘సైరా’ విడుదలకు ప్రత్యేకమైన డేట్ !

‘సైరా’ విడుదలకు ప్రత్యేకమైన డేట్ !

Published on May 12, 2019 4:00 AM IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ‘సైరా’కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారట.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు