పవన్ స్పెషల్ సాంగ్ కోసం హై రేంజ్ గ్రాఫిక్స్.!

పవన్ స్పెషల్ సాంగ్ కోసం హై రేంజ్ గ్రాఫిక్స్.!

Published on Mar 25, 2015 3:57 PM IST

rey
పెద్ద మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదంతో, చిన్న మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం, సపోర్ట్ తో వీరి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తెలుగు చిత్ర సీమకి హీరోగా పరిచయం అయ్యాడు. దర్శకనిర్మాత అయిన వైవిఎస్ చౌదరి సాయి ధరమ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన మొదటి సినిమా ‘రేయ్’. ఈ సినిమా వాయిదా పడడం వల్ల సాయి ధరమ్ తేజ్ రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ ముందే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అన్ని ఇబ్బందులను క్లియర్ చేసుకున్న రేయ్ సినిమా మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సినిమా కోసం రేయ్ టీం ‘రేయ్ విత్ పవనిజం’ అనే ఓ స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ సాంగ్ కి పవన్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సాంగ్ ని విజువల్ గా కూడా షూట్ చేసి సినిమాలో పెట్టాలనుకున్నారు. అందులో భాగంగానే ఈ పాటని సాయి ధరమ్ తేజ్, శ్రద్ధ దాస్, సయామీ ఖేర్ లపై షూట్ చేసారు. వైవిఎస్ చౌదరి ఈ పాటలో హై రేంజ్ గ్రాఫిక్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రాఫిక్స్ కి సంబందించిన వర్క్ జరుగుతోంది. దానిని ఫాస్ట్ గా ఫినిష్ చేసి రిలీజ్ అయిన రెండు మూడు రోజుల తర్వాత సినిమాలో యాడ్ చేస్తారు.

సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ హీరోయిన్స్ గా నటించారు. వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ సినిమాని ఎక్కువ భాగం కరేబియన్ దీవులు, కాలిఫోర్నియాలో షూట్ చేసారు. స్వర్గీయ చక్రి సంగీతం అందించాడు.

తాజా వార్తలు