అల్లు శిరీష్ సినిమాకి ప్రత్యేక అతిధిగా.. !

Published on May 11, 2019 4:06 pm IST

యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా వస్తోన్న చిత్రం ‘ఏబిసిడి’. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల13న హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఈవెంట్ జరుగనుంది. కాగా ఈ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నారు.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు. మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు, బాల నటుడు భరత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మంచి హిట్ కోసం ఎప్పటినుంచో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోన్న అల్లు శిరీష్ ఈ సినిమాతో భారీ హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More