మాస్ మహారాజా రవితేజ రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పై కొన్ని ఆసక్తికరమైన ప్రమోషన్స్ ను ప్లాన్ చేశాడట శివ నిర్వాణ. ఈ క్రమంలోనే రవితేజతో పాటు పలు స్పెషల్ ఇంటర్వ్యూలను అలాగే శబరిమల ఆలయం నేపథ్యంలో కూడా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూను ప్లాన్ చేశారట. మొత్తానికి ప్రమోషన్స్ లో ఈ మధ్య డైరెక్టర్ లు ఎక్కువగా ఇన్ వాల్వ్ అవుతున్నారు.
కాగా తండ్రీకూతుళ్ల మధ్య సాగే అత్యంత బలమైన ఎమోషన్స్ నేపథ్యంతో ఈ సినిమా రాబోతుంది.ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ‘అయ్యప్ప పడి పూజ’ పాట సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.


