పుష్ప షూటింగ్ కోసం ప్రత్యేక సెట్స్ ?

Published on May 2, 2021 5:33 pm IST

దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా షూటింగ్ ను మే సెకెండ్ వీక్ నుండి ఎలాగైనా స్టార్ట్ చేయాలని ప్రస్తుతం కసరత్తులు చేస్తోన్నట్టు తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ లోనే పుష్ప షూటింగ్ కూడా వీలైనంత వరకు ప్రత్యేక సెట్స్ ను నిర్మించి, ఆ సెట్స్ లోనే చిత్రీకరణ జరపాలని భావిస్తున్నారట. అందుకే ఈ రోజు నుండి హైదరాబాద్ కి దూరప్రాంతంలో ఒక సెట్ వేస్తున్నారట. ఇక పుష్ప కోసం రంగస్థలం పద్ధతి ఫాలో అవనున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇక గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ ఆలస్యం అయిన నేపథ్యంలో త్వరగా మూవీ పూర్తి చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడు. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, బన్నీకి సోదరి పాత్రలో కనిపించబోతుందట. ఈ సినిమాలో మరో స్పెసల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :