రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ !

1st, February 2018 - 03:35:34 PM

చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆయన బోయపాటి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల రెండో వారం నుండి ఈ సినిమా యొక్క రెండవ షెడ్యూల్ ప్రారంభంకానుంది. హీరోయిన్ స్నేహ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ ఇందులో విలన్ గా నటించబోతున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

తాజా సమాచారం మేరకు తన ప్రతి సినిమాలోను ఒక స్పెషల్ పాట ఉండేలా చూసుకునే బోయపాటి ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉండేలా చూస్తున్నారని, అందులో టాప్ హీరోయిన్ ఒకరు చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఆ టాప్ హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఆ పేరును చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనున్నారు. చరణ్ సరసన ఈ మూవీలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.