అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని రెడీ చేస్తున్న ఎన్టీఆర్
Published on Jun 14, 2017 8:25 am IST


స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగులు ఇప్పుడొక ట్రెండు. అభిమానుల్ని ఉర్రుతలూగించాలంటే తమ చిత్రాల్లో ఓ స్పెషల్ సాంగ్ ఉండాలని అగ్రహీరోలు భావిస్తున్నారు. జనతా గ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్ సాంగ్ లో కాజల్ తో కలసి ఎన్టీఆర్ స్టెప్పులేశాడు. ఆ పాట మాస్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కు సరిజోడిగా కాజల్ కూడా స్టెప్పులు ఇరగదీసింది.

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ ఐటమ్ పాటని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే రికార్డ్ చేశాడని సమాచారం. ఈ పాటలో ఎన్టీఆర్ తో కలసి స్టెప్పులేసే హీరోయిన్ వేటలో ప్రస్తుతం చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లు ఎన్టీఆర్ అభిమానుల్ని బాగా ఆకర్షించాయి. ఈ చిత్రాన్ని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండడం విశేషం.

 
Like us on Facebook