ఫ్యాన్స్ కోసం బంపర్ గిఫ్ట్ ప్లాన్ చేసిన ఎన్.టి.ఆర్

ఫ్యాన్స్ కోసం బంపర్ గిఫ్ట్ ప్లాన్ చేసిన ఎన్.టి.ఆర్

Published on May 17, 2015 8:58 PM IST

ntr1
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఓ స్టార్ హీరో లేదా హీరోయిన్ బర్త్ డే వస్తుంది అంటే ఆ స్టార్ కి సంబందించిన ఫస్ట్ లుక్ లేదా ఫస్ట్ టీజర్ లాంటివి రిలీజ్ చేయడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాత్రం ఈ సారి తన బర్త్ డే కి సరికొత్త రీతిలో ఓ క్రేజీ స్పెషల్ గిఫ్ట్ ని అభిమానులకు ఇవ్వనున్నాడు. మే 20న ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు.

తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ తన పుట్టిన రోజున తన వారసుడైన అభయ్ రామ్ ఫోటోలను అధికారికంగా మీడియాకి రిలీజ్ చేయనున్నారని వినికిడి. ఒక నాలుగు నెలల క్రితమే ఎన్. టి.ఆర్ – ప్రణతి దంపతులకు అభయ్ రామ్ జన్మించాడు. ఇప్పటి వరకూ అభయ్ రామ్ కి సంబందించిన ఒక్క ఫోటో కూడా బయటకి రాలేదు. కానీ అభిమానుల కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ని ప్లాన్ చేసాడు. ఈ వార్త వినగానే అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఇదిలా ఉంటే టెంపర్ తో సక్సెస్ ని అందుకున్న ఎన్.టి.ఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న ‘మా నాన్నకు ప్రేమతో’ అనే సినిమా కోసం సిద్దమవుతున్నాడు.

తాజా వార్తలు