మంచు విష్ణు ‘ఎర్రబస్సు’లో స్పెషల్ కామెడీ ట్రాక్.

మంచు విష్ణు ‘ఎర్రబస్సు’లో స్పెషల్ కామెడీ ట్రాక్.

Published on Aug 14, 2014 12:32 AM IST

manchu-vishnu

దర్శకరత్న దాసరి నారాయణరావు, మంచు విష్ణు కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎర్రబస్సు’. విష్ణు సరసన కేథరీన్ త్రేసా హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో ఘన విజయం సాదించిన ‘మంజ పై’ చిత్రాన్నికి తెలుగు రీమేక్ ఇది. దర్శకుడిగా దాసరి 151వ సినిమా. ఈ సినిమాలో దాసరి, విష్ణు తాతా మనవళ్లుగా నటిస్తున్నారు. పల్లెటూరి నుండి మనవడి కోసం సిటీకి వచ్చిన తాత ఎటువంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు అనే కధాంశంతో తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో కామెడీ భాధ్యతలను కృష్ణుడు తీసుకున్నారు. ఆంటీ పాత్రలో కృష్ణుడు కనిపిస్తారని సమాచారం. పాత్ర డిమాండ్ మేరకు అతని చేత లేడీ గెటప్ వేయించారట దాసరి. ఆంటీ గెటప్ లో కృష్ణుడు చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని సమాచారం. ప్రస్తుతం సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు