ఆ లెక్కన ఎన్టీఆర్ ని రెండేళ్లు మిస్సయినట్లేగా..!

Published on Jan 21, 2020 1:05 pm IST

ఆర్ ఆర్ ఆర్ విడుదల దాదాపు వాయిదాపడ్డట్లే అని తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ అండ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఈ విషయంపై నిన్న ఓ హింట్ ఇచ్చారు. ఆయన ప్రత్యేకంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ పేరు ప్రస్తావించకున్నా, పరోక్షంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదాపుడుతుందని చెప్పారు. సౌత్ బడా బడ్జెట్ మూవీ అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశం కలదని ఆయన ట్వీట్ చేశారు. దీనితో ఆర్ ఆర్ ఆర్ చెప్పినట్లుగా జులై 30న రిలీజ్ కావడం అసాధ్యంగానే కనిపిస్తుంది.

ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆయన్ని రెండేళ్లు మిస్సయినట్లే. 2019 ఎటువంటి సినిమాలో నటించకుండా ముగించిన ఎన్టీఆర్ 2018 అక్టోబర్ లో దసరా కానుకగా అరవింద సమేత మూవీని విడుదల చేశారు. ఆర్ ఆర్ ఆర్ 2020 దసరా కి పోస్ట్ ఫోన్ అయ్యే పక్షంలో ఎన్టీఆర్ ని వెండితెరపై చూసి ఖచ్చితంగా రెండుళ్లు అవుతున్నట్లు లెక్క. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి రెండేళ్ల గ్యాప్ అంటే చాల ఎక్కువ. ఆయన కెరీర్ బిగినింగ్ నుండి ఇంత లాంగ్ గ్యాప్ ఇచ్చింది లేదు. దీనితో యంగ్ టైగర్ ని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More